EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటపల్లి సొసైటీ చైర్మన్‌కు పెరిక కుల సంఘం ఘన సన్మానం.

    Author
    Posted By JANA CHARITRA
    | 06 Oct 2026, 01:09 PM | TELANGANA, వరంగల్
    చౌటపల్లి సొసైటీ చైర్మన్‌కు పెరిక కుల సంఘం ఘన సన్మానం.

    పర్వతగిరి, అక్టోబర్ జన చరిత్ర న్యూస్.
    చౌటపల్లి ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా పెరిక కులానికి చెందిన అతి మారస్వామి నియమితులైన సందర్భంగా వడ్లకొండ గ్రామంలోని పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
    గ్రామంలోని పెరిక కుల సంఘం పెద్దలు జుట్టుకొండ వీరయ్య, కుల సర్పంచ్ జుట్టుకొండ మల్లయ్య, ఉపాధ్యక్షుడు జుట్టుకొండ దేవయ్య, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అతి కుమారస్వామిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చౌటపల్లి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు.
    అతి కుమారస్వామి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన చైర్మన్‌గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వడ్లకొండ గ్రామ రైతులతో పాటు చౌటపల్లి సొసైటీ పరిధిలోని ఇతర గ్రామాల రైతుల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో పెరిక కుల సంఘం పెద్దలు, నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.