EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో అవసరం: ఈగ మల్లేశం

    Author
    Posted By JANA CHARITRA
    | 07 Oct 2026, 05:16 PM | TELANGANA, వరంగల్
    క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో అవసరం: ఈగ మల్లేశం

    వర్ధన్నపేట, అక్టోబర్ 7: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు.
    వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డి.సి. తండా దుర్గమ్మ గుడి ప్రాంగణంలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో కేశవపురం, ఎన్‌ఎస్ తండా జట్లకు టాస్ వేసిన ఈగ మల్లేశం.. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు.
    ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. యువత క్రీడల్లో రాణిస్తూ క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆటలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, యువత క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
    గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో సేవాలాల్ యూత్ సభ్యులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి పోటీల ద్వారా యువతలోని ప్రతిభను గుర్తించి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు.
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు కల్పిస్తున్న ప్రత్యేక రిజర్వేషన్లు, ఇతర అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడాలని ఈగ మల్లేశం సూచించారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
    ఈ కార్యక్రమంలో కరిమిల్ల సంపత్ రావు, జన్ను రాములు, ప్రభాకర్, రాము నాయక్, సంతోష్ నాయక్, రమేష్, నరేశ్ తదితరులతో పాటు యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు