EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Oct 2026, 08:57 PM | TELANGANA, వరంగల్
    నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

    *పెండింగ్ కేసులపై సీరియస్ గడువులోగా పూర్తి చేయకపోతే శాకా పరమైన చర్యలు తీసుకుంటా*

    *ఇసుక లారీల వేగానికి బ్రేక్ రోడ్డు ప్రమాద నివారణకు కఠిన చర్యలు కఠిన చర్యలు*

    *జిల్లా ప్రారంభం నుండి జిల్లా ముగింపు వరకు ప్రత్యేక అదనపు బలగాలతో 24/7 డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్.*

    *ఇసుక లారీలు స్పీడ్ లిమిట్ దాటితే ఇకపై సీజ్*

    ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీస్ అధ్యక్షతన నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, కోర్టు కేసుల పురోగతి, రోడ్డు ప్రమాదాల నివారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తదితర అంశాలపై ఎస్పీ సమీక్షించారు.

    పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్న కేసులపై ఎస్పీ తీవ్రంగా స్పందించారు. ప్రతి కేసును నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జాప్యానికి గల కారణాలపై సంబంధిత అధికారులను వివరణ కోరారు. నిర్దేశిత గడువులోగా కేసులను పరిష్కరించకపోతే బాధ్యులపై ఛార్జ్ మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు.

    ఈ-సాక్ష్య అప్డేట్ తప్పనిసరి
    కేసుల దర్యాప్తులో ఈ-సాక్ష్య (e-Sakshya) వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎస్పీ సూచించారు.

    ఇవి కూడా చదవండి

    కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఛార్జ్‌షీట్ నమోదు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

    కోర్టు కానిస్టేబుళ్లు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
    కోర్టు కానిస్టేబుళ్లు విధుల్లో సమయపాలన, సమయపాలనతో పాటు కేసులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై అవగాహన, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. కోర్టు కేసుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

    రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
    జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత పెంచే దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
    జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో 24/7 రౌండ్ ద క్లాక్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు పోలీస్ సిబ్బందిని కేటాయించి నిరంతర తనిఖీలు చేపట్టాలని సూచించారు.

    స్థానిక పోలీస్ అధికారులు తమ పరిధిలోని లారీ డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి, అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్రలేమి తదితర కారణాలతో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు.
    కమలాపురం, మండపాక, తాడ్వాయి, జవహర్‌నగర్ టోల్‌గేట్ తదితర ప్రాంతాల్లో 24/7 డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.

    లారీల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ లాక్,
    ఇసుక లారీల కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై TSMDC ఉన్నతాధికారితో ఎస్పీ చర్చించారు.

    ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
    స్థానిక ఎస్‌ఐలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, చెక్‌పోస్టులు, ప్రధాన రహదారులు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.

    నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

    ఈ నేర సమీక్షా సమావేశంలో ఏటూరునాగారం ఏ ఎస్పీ మనన్ బట్ ఐపీఎస్ అదనపు ఎస్పీ సదానందం, ములుగు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రవీందర్, డి సి ఆర్ బి డి ఎస్ పి కిషోర్ కుమార్, ఎస్ బి ఇన్స్పెక్టర్ ప్రతాప్, స్థానిక సీఐలు, ఆర్మడ్ రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ లు,ఎస్ఐలు, ఐ టీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.