EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ.

    Author
    Posted By JANA CHARITRA
    | 09 Oct 2026, 07:40 PM | TELANGANA, వరంగల్
    జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ.

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరిమండలంలోని చింతనెక్కొండ గ్రామం విజ్ఞాన భారతి విద్యాలయంలో శుక్రవారం జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
    ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మరియు జయహో ఫౌండేషన్ వ్యవస్థాపకులు అక్కినపెల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ *అవసరంలో ఉన్న వారికి సేవ చేయడం లోనే నిజమైన ఆనందం ఉంటుందని అన్నారు.*
    ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలకు ప్రతినెల విరాళాలు అందిస్తున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాషా, రజిత, సుమలత, సరిత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.