EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రెడ్‌క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఘన సన్మానం

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Oct 2026, 08:00 PM | TELANGANA, వరంగల్
    రెడ్‌క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఘన సన్మానం

    వరంగల్: రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబును ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షుడు రొటేరియన్ సోమ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

    ఈ సందర్భంగా జాతీయస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ చిరంజీవి చేతన్ శౌర్యకు క్రీడల్లో మరింత రాణించేందుకు ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే రెడ్‌క్రాస్ సభ్యుడు, రొటేరియన్ తోట సంపత్‌ను, వరంగల్ జిల్లా ఫోటోగ్రఫీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రొటేరియన్ వంగరి వేణుగోపాల్‌ను ఘనంగా సన్మానించారు.

    ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ కార్యదర్శి రొటేరియన్ నాయిని అనిల్ కుమార్, జూలూరి కృష్ణమూర్తి, అసిస్టెంట్ గవర్నర్ పోరాడ్ల రత్నాకర్, కుమారస్వామి, కోరే చంద్రమౌళి, కొడం రాజేందర్ సుంకనపల్లి శ్రీనివాస్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించడం, ప్రతిభావంతులకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.