EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఊకల్ నాగేంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణా రాష్ట్ర (ఎండోమెంట్స్ ) దేవాదాయ కమీషనర్ శ్రీ. M. హనుమంత రావు.

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Oct 2026, 08:02 PM | TELANGANA, వరంగల్
    ఊకల్ నాగేంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణా రాష్ట్ర (ఎండోమెంట్స్ ) దేవాదాయ కమీషనర్ శ్రీ. M. హనుమంత రావు.

    సుప్రసిద్ధ ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయాంభువుగా వెలిసి ఇప్పటికీ తన ఉపస్థితి చాటుతూ, వల్మీకమే గర్భలయంగా, నిత్య పూజలతో వారోత్సవాలతో భక్తుల కొంగు బంగారమై స్వయంభువుగా ప్రపంచంలోనే ప్రత్యేకంగా సుప్రసిద్ధమైన ఊకల్ దేవాలయానికి తెలంగాణా రాష్ట్ర ఎండోమెంట్స్ (దేవాదాయ ) శాఖ కమీషనర్ శ్రీ. M. హనుమంత రావు గారు దేవాలయం మహిమ తెలుసుకొని నేడు ధర్మ పత్ని సమేతంగా విచ్చేసి, పుట్టలో పాలు పోసి మొక్కుచెల్లించారు.
    ఆలయ ప్రధాన అర్చకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీమాన్ సముద్రాల సుదర్శన్ ఆచార్య వర్యులు ఆలయ సంప్రదాయలతో స్వాగతించి ప్రత్యేక పూజలు చేయించి అనంతరం వారిని వేదాశీర్వచనము మరియి స్వామి వారి శేష వస్త్రములను దంపతులకు ప్రధానం చేయడం జరిగింది. ఆలయ విశేషాల గురించి వారు సాదరంగ విశదీకరించారు. అనంతరం దంపతీ సమేతంగా అయ్యగారి ఆశీస్సులు కమీషనర్ అందుకున్నారు. స్వామి అలంకారం చూసి వారు ఆలయ అర్చకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో, ఆలయ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వర్ రావు మరియి ఆలయ బాధ్యులు భక్తులు పాల్గొన్నారు.