EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పెద్దమడుర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. హాజరై బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Oct 2026, 11:41 AM | TELANGANA, వరంగల్
    పెద్దమడుర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. హాజరై బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

    పెద్దమడుర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. హాజరై బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

    *చీకట్లోనే సుమారు 20 నిమిషాలకు బతుకమ్మ ఆడిన మహిళలు.*

    *రాష్ట్రంలో కరెంట్ కష్టాలు రేవంత్ చెయ్యబట్టే.*

    ఇవి కూడా చదవండి

    జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడుర్ గ్రామంలో 7వ రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆ గ్రామ ఆనవాయితీ వస్తుంది. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో కోలాటం కూడా ఆడారు. మహిళల్లో పండుగ ఉత్సాహాన్ని నింపుతూ వారితో మమేకమై మాజీ మంత్రి ఎర్రబెల్లి బతుకమ్మ ఆడటంతో అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా గ్రామ ఆడ బిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! తెలిపారు.

    ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ అన్నారు. ప్రకృతిలో లో లభించే తీరొక్క పూలను సేకరించి వాటిని అందంగా వలయా కృతిలో పేర్చి అమ్మవారు ఆ పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ అన్నారు. ప్రపంచంలోనే ఆడ బిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే వుంది. తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మ గౌరవం ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి గా నిలిచింది బతుకమ్మ పండుగ. అందుకే మాజీ సీఎం కెసీఆర్ గారు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్ణయించి నిర్వహిస్తున్నారన్నారు. సీఎం కేసీఅర్ గారు ఆడ బిడ్డలకు పండుగ కానుక గా బతుకమ్మ చీరలు ఇచ్చారు. కానీ ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి హయంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల ఇవ్వడంలో జప్యం చేస్తున్నారు. చెరువులలో కుంటలలో బతుకమ్మను సాగనంపేందుకు నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ కు పాలన చేత కాక రాష్ట్రంలో కరెంట్ కష్టాలు వస్తున్నాయి స్వయానా నేను ఇప్పుడు బతుకమ్మ ఎత్తుకొని వస్తున్న సమయంలోనే కరెంట్ పోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు

    ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు, గ్రామ ఆడబిడ్డలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.