EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. వెంట డీసీసీ అధ్యక్షుడు ఇనగాల, ఎమ్మెల్యే నాయిని

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Oct 2026, 03:15 PM | TELANGANA, వరంగల్
    భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. వెంట డీసీసీ అధ్యక్షుడు ఇనగాల, ఎమ్మెల్యే నాయిని

    భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. వెంట డీసీసీ అధ్యక్షుడు ఇనగాల, ఎమ్మెల్యే నాయిని
    వరంగల్, అక్టోబర్ 17: శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం దర్శించుకున్నారు. ఆయన వెంట హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
    ఆలయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులకు అర్చకులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు.
    ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లు, ఆలయ విశేషాల గురించి అర్చకులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు మంత్రి శ్రీధర్ బాబు, ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులకు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు.
    శరన్నవరాత్రి ఉత్సవాలతో భద్రకాళి ఆలయం భక్తులతో సందడిగా మారిన నేపథ్యంలో ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోవడం విశేషంగా నిలిచింది.