EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నరకుడు రవీందర్ కుటుంబానికి అండగా ఉంటాం ఏకశిలా ఆసుపత్రిలో రవీందర్‌ను పరామర్శించిన టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Oct 2026, 07:48 AM | TELANGANA, వరంగల్
    నరకుడు రవీందర్ కుటుంబానికి అండగా ఉంటాం ఏకశిలా ఆసుపత్రిలో రవీందర్‌ను పరామర్శించిన టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.

    నరకుడు రవీందర్ కుటుంబానికి అండగా ఉంటాం
    ఏకశిలా ఆసుపత్రిలో రవీందర్‌ను పరామర్శించిన టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.

    *కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా.. ప్రత్యేక చొరవ చూపిన వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీనివాస్.*

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, అక్టోబర్ 17:

    ఇవి కూడా చదవండి

    పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరకుడు రవీందర్ అనారోగ్యంతో ఏకశిలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి రవీందర్‌ను పరామర్శించారు.
    ఈ సందర్భంగా వైద్యులను అడిగి రవీందర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. రవీందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని, ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
    రవీందర్ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ సిలువేరు శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రవీందర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు నాయకులు ముందుకు రావడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బందెల రాజభద్రయ్య, వడ్లకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్, ఎస్సీ సెల్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.