EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యా, సామాజిక రంగాల్లో విశేష సేవలందించిన భాస్కర్‌కు సముచిత గుర్తింపు ఇవ్వాలి – మందల శంకరయ్య, మెరుగు సత్తయ్య

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Oct 2026, 07:49 AM | TELANGANA, హన్మకొండ
     విద్యా, సామాజిక రంగాల్లో విశేష సేవలందించిన భాస్కర్‌కు సముచిత గుర్తింపు ఇవ్వాలి – మందల శంకరయ్య, మెరుగు సత్తయ్య

    గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పద్మశాలి విద్యావేత్త ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు అవకాశం కల్పించాలి

    విద్యా, సామాజిక రంగాల్లో విశేష సేవలందించిన భాస్కర్‌కు సముచిత గుర్తింపు ఇవ్వాలి – మందల శంకరయ్య, మెరుగు సత్తయ్య

    హనుమకొండ: రానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు అవకాశం కల్పించాలని శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మందల శంకరయ్య, పద్మశాలి పరపతి సంఘం అధ్యక్షుడు మెరుగు సత్తయ్య కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

    ఈ సందర్భంగా మందల శంకరయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాకతీయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల స్ఫూర్తితో తెలంగాణ సాధన కోసం అనేక మంది విద్యావేత్తలు కృషి చేశారని గుర్తుచేశారు. అలాంటి విద్యా, సామాజిక నేపథ్యం కలిగిన ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం సముచితమని అన్నారు.

    ఇవి కూడా చదవండి

    కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసిన గడ్డం భాస్కర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించి, ఆదర్శ ఆచార్యుడిగా పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకర్ కార్యాలయంలో ఓఎస్‌డీగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉందని తెలిపారు. ప్రస్తుతం కూడా పలు విద్యాసంస్థలకు సలహాదారుగా వ్యవహరిస్తూ, విద్యా రంగంలో తన అనుభవాన్ని పంచుకుంటూ అధ్యాపకులు, విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారని వివరించారు.

    మెరుగు సత్తయ్య మాట్లాడుతూ, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ విద్యా రంగంతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లోనూ తనదైన పాత్ర పోషించారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పద్మశాలి విద్యావేత్తగా ఆయనకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే, విద్యావేత్తలకు ప్రోత్సాహం లభించడంతో పాటు పద్మశాలి సమాజానికి తగిన గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

    గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికలో విద్యా, సామాజిక సేవ, ప్రజా జీవితంలో అనుభవం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. అర్హతలు, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ పేరును పరిశీలించి, ఆయనకు సముచిత అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

    ఈ కార్యక్రమంలో పద్మశాలి పరపతి సంఘం సభ్యులు బండా కాళిదాస్, పేరాల కనకయ్య, చేరాల సర్వేశం, కందికట్ల శ్రీనుకుమార్, ప్రొఫెసర్ రతన్‌సింగ్ రాకూల్, మామిడాల ప్రకాశ్‌రావు, తేరాల నర్సింగరావు, గాడిపెల్లి ప్రభాకర్, నమిషకవి గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు.