EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాశిబుగ్గలో ఘనంగా దుర్గాభవాని మహా అన్నదానం

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Oct 2026, 07:53 AM | TELANGANA, వరంగల్
    కాశిబుగ్గలో ఘనంగా దుర్గాభవాని మహా అన్నదానం

    వరంగల్, అక్టోబర్ 17: వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో దుర్గాభవాని యూత్ ఆధ్వర్యంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోపాల్ నవీన్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా వారు శ్రీ దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.

    అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో కొమ్ముల కిషోర్, గన్పాక సుధాకర్, జన్ను శ్యామ్, మబ్బు ప్రవీణ్, కె. సంపత్, గడ్డమీద రాజేష్, శ్రీకాంత్, అరుణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుర్గాభవాని యూత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.