EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లేబర్ కాలనీలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు

    Author
    Posted By JANA CHARITRA
    | 20 Oct 2026, 12:11 PM | TELANGANA, వరంగల్
    లేబర్ కాలనీలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు  బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు

    వరంగల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు వరంగల్‌లోని లేబర్ కాలనీలో అంబరాన్నంటాయి. ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాదిమంది మహిళలు, ప్రజలు పాల్గొని సంప్రదాయ పూల బతుకమ్మలతో తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని చాటిచెప్పారు.

    ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో విజేతలకు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా వన్‌గ్రామ్ గోల్డ్ బహుమతిని ప్రదానం చేయగా, ఇతర విజేతలకు, ఎయిర్ ఫైర్లు కన్సొలేషన్ బహుమతులు కూడా అందజేశారు.

    పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు, మహిళల కోలాటాలు, సంప్రదాయ పాటలతో లేబర్ కాలనీ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాస్కుల బాబు, కుందారపు రాజేందర్, కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, మూడేళ్ల సతీష్, M1 TV ప్రతినిధి బేతి రాజు, భోగేశ్వర శాస్త్రి, రాజు, రవి, రమేష్‌తో పాటు ఉషోదయ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయాలకు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.