EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Oct 2026, 02:31 PM | TELANGANA, వరంగల్
    పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

    హనుమకొండలో పోలీసు అమరవీరుల ర్యాలీలో పాల్గొని ఘన నివాళులర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

    హనుమకొండ: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన పోలీసు ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

    హనుమకొండ చౌరస్తా నుంచి పోలీసు ప్రధాన కార్యాలయం వరకు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని, దేశ రక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం పోలీసు ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పోలీసు విధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేయాల్సిన గొప్ప బాధ్యత అని అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

    దేశం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.

    పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల రక్షణలో వారి అంకితభావానికి గౌరవం చాటేలా ఈ కార్యక్రమం నిర్వహించారు.