EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Oct 2026, 05:57 PM | TELANGANA, నల్గొండ
    మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

    పానగల్ ఛాయా సోమేశ్వరాలయానికి రూ.20 కోట్లు మంజూరు చేయించిన మంత్రి
    ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఛాయా సోమేశ్వర ఆలయ కమిటీ
    నల్లగొండ:
    నల్లగొండ పట్టణ సమీపంలోని చారిత్రాత్మక పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
    ఆలయ కమిటీ చైర్మన్ కోడదల ఎల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయం ప్రాంగణంలో మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుమీద ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా 1వ డివిజన్ కార్పొరేటర్ ఆట్లకుంట్ల నాగరాజు, ఛాయా సోమేశ్వర ఆలయ చైర్మన్ కోడదల ఎల్లయ్య లు మాట్లాడుతూ
    శతాబ్దాల చరిత్ర కలిగిన ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు కావడం సంతోషకరమని, ఈ నిధులతో ఆలయానికి మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
    ఆలయ అభివృద్ధి పనులు పూర్తయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు.
    12వ శతాబ్దం కుందూరు చోళుల కాలంలో నిర్మించిన ఆలయ చారిత్రక ప్రాధాన్యతను, ప్రాచీన నిర్మాణాల విశిష్టతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
    ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధి చెందడం ద్వారా పానగల్ ప్రాంతానికి చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
    ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు
    ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి భవిష్యత్తులోనూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతూ, పానగల్ ప్రాంత ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గుండగోని యాదయ్య గౌడ్, గురజాల నరేందర్, గుండగోని శ్రీనివాస్ గౌడ్, బుర్రి యాదయ్య, కొమ్ము జానీ యాదవ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కొప్పు ప్రవీణ్, కొప్పు సత్తయ్య, గండికోట సాగర్, హరి శంకర్, జంపాల శంకర్, హర్ష, తక్కెళ్ళ బన్నీ, ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు