EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 13వ డివిజన్‌ విద్యుత్ నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం కోమటిరెడ్డి, కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Oct 2026, 06:07 PM | TELANGANA, వరంగల్
    13వ డివిజన్‌ విద్యుత్ నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం  కోమటిరెడ్డి, కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి  ఫ్లెక్సీలకు పాలాభిషేకం

    *నల్లగొండ పట్టణంలోని 13వ డివిజన్ విద్యుత్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు*

    *రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో
    కాలనీలో సీసీ రోడ్లు వేయించడంతో స్థానికులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు*

    *ఈ సందర్భంగా విద్యుత్ నగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంచర్లకుంట్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు , అభిమానులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు*

    ఇవి కూడా చదవండి

    *కాలనీలో రోడ్ల నిర్మాణానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డిలకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు*

    ఈ కార్యక్రమంలో
    నాగవెల్లి రమేష్, ఎల్లంల హరిధర్, మొయినుద్దీన్, కత్తుల రాంబాబు,నిమ్మల గోటి రమేష్, చెరుపల్లి మురళి, బొజ్జ వెంకన్న, నోముల శేఖర్, అల్లంపల్లి గిరి, చందుపట్ల వెంకన్న, స్టార్ వెంకన్న, కాసోజు రమేష్, వేముల కోటయ్య, వేముల లింగయ్య, మల్లేష్, ఊట్కూరు దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    *******************
    *13 డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా: గుమ్ముల మోహన్ రెడ్డి*

    నల్గొండ మున్సిపల్ కార్యాలయం 13వ డివిజన్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు.
    మంగళవారం 13వ డివిజన్ విద్యుత్ నగర్ కాలనీలో చేపట్టిన సి.సి రోడ్డు పనులను పరిశీలించారు.
    ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి చేపట్టాలని సూచించారు.
    డివిజన్లోని అన్ని కాలనీలో సిసి రోడ్డు పనులను చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
    13వ డివిజన్ లో అన్ని వార్డులను అభివృద్ధి చేసి ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో విద్యుత్ నగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్లకుంట్ల వెంకట్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.