EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ పాఠశాల బంగారు బాట*

    Author
    Posted By Gade Krishna
    | 27 Oct 2026, 08:19 PM | Array
    *గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ పాఠశాల బంగారు బాట*

    జన చరిత్ర,(మహబూబాబాద్ జిల్లా) బ్యూరో
    నెల్లికుదురు,ఆక్టోబర్ 27


    *నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన....*

    *విద్య ద్వారానే సమాజంలో సమానత్వం – విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి....*


    మహబూబాబాద్ జిల్లా
    నెల్లికుదురు విద్యారంగ అభివృద్ధి, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పబ్లిక్ స్కూల్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నెల్లికుదురులో రూ.7 కోట్ల 50 లక్షల నిధులతో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 122 పబ్లిక్ స్కూళ్లకు అనుమతులు లభించగా, మహబూబాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నెల్లికుదురులో ఈ పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేం నరేందర్ రెడ్డి హాజరుకాగా, సభకు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అధ్యక్షత వహించారు. ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు జెన్నా రెడ్డి, భారత్ చందర్ రెడ్డి,మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి రమేష్ నాయక్ కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా విద్య ప్రాధాన్యతను వివరిస్తూ, పబ్లిక్ స్కూల్స్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను వెలికితీయడం, ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఇటువంటి పాఠశాలలు దోహదపడతాయని తెలిపారు.

    విద్యార్థులారా.. మీ కలలకు పేదరికం అడ్డుకాకూడదు. కష్టపడి చదవండి..ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోండి.. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. నేటి విద్యార్థులే రేపటి డాక్టర్లు,ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, ప్రజా నాయకులు. మీలోని ప్రతిభను గుర్తించి,ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.

    రూ.7.50 కోట్లతో నిర్మించనున్న ఈ పబ్లిక్ స్కూల్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవకాశం ఏర్పడనుంది. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

    మహబూబాబాద్ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ఈ పబ్లిక్ స్కూల్ శంకుస్థాపన ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.

    ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు సర్పంచులు ఉపసర్పంచ్లు ఇందిరమ్మ కమిటీ సభ్యులు యూత్ కాంగ్రెస్ నాయకులు అధికార ప్రతినిధులు ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ ఓబీసీ సెల్ మైనార్టీ సెల్, కేసముద్రం మహబూబాబాద్ పలు వార్డుల కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.