EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బోనం ఎత్తుకున్న నల్లగొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Aug 2026, 08:53 PM | TELANGANA, తెలంగాణ, నల్గొండ
     బోనం ఎత్తుకున్న నల్లగొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

    నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ పాతబస్తీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్నారు.
    ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకన్న, ఆర్టీఏ సభ్యుడు కూసుకుంట్ల రాజిరెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

    బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళలు బోనాలతో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. పాతబస్తీలో పండుగ వాతావరణం నెలకొంది