EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *నల్లబెల్లి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం లి. అధ్యక్షుడిగా కొండ బిక్షపతి

    Author
    Posted By JANA CHARITRA
    | 13 Aug 2026, 10:46 PM | TELANGANA, వరంగల్, హన్మకొండ
    *నల్లబెల్లి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం లి. అధ్యక్షుడిగా కొండ బిక్షపతి

    *నల్లబెల్లి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం లి. అధ్యక్షుడిగా కొండ బిక్షపతి*
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా కొండ బిక్షపతి గెలుపొందారు. అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా శ్యాంసుందర్- ప్రధాన కార్యదర్శిగా చింతకాయల భద్రయ్య- పాలకవర్గ సభ్యులుగా ఎలబోయిన చంద్రకళ-పొన్నం లింగమ్మ-
    వాకిటి సతీష్-ఎలబోయిన సుధాకర్-పులుగుజ్జ వంశీ-తోట రాజేందర్- గెలుపొందారు.ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కొండ బిక్షపతి మాట్లాడుతూ.. నల్లబెల్లి మత్స్య పారిశ్రామిక కార్మికుల అభివృద్ధికి పాటుపడతానని ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించుటకు కృషి చేస్తానని జిల్లా ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా నా మీద నమ్మకంతో నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.