EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కొండా కరుణాకర్

    Author
    Posted By JANA CHARITRA
    | 14 Aug 2026, 08:19 AM | TELANGANA, వరంగల్, హన్మకొండ
    వరంగల్ పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కొండా కరుణాకర్

    110 మంది అధికారులు ఓటు హక్కు వినియోగం
    వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో జరిగిన ఈ ఎన్నికల్లో వివిధ హోదాలకు చెందిన పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
    వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్య పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.
    ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారి, ఎన్నికల నిర్వహణ అధికారులకు పలు సూచనలు చేశారు.
    ఈ ఎన్నికల్లో మొత్తం 110 మంది వివిధ హోదాల్లో ఉన్న పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కొండా కరుణాకర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ టి. బాబుపై 17 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
    నూతన కార్యవర్గం
    అధ్యక్షుడు: కొండా కరుణాకర్ – కానిస్టేబుల్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్
    ఉపాధ్యక్షులు: బి. సతీష్ – ఆర్‌ఐ, బి. శరత్ కుమార్ – ఆర్‌ఎస్‌ఐ
    ప్రధాన కార్యదర్శి: ఇ. వీరభద్రరావు – ఎస్‌ఐ, దామెర
    సంయుక్త కార్యదర్శి: టి. నరేష్ – కానిస్టేబుల్, కాజీపేట
    కార్యనిర్వహణ కార్యదర్శి: ఎస్. ప్రవీణ్ కుమార్ – ఏఆర్ కానిస్టేబుల్
    కోశాధికారి: బి. నరేష్ – కానిస్టేబుల్, పాలకుర్తి
    కార్యనిర్వాహక సభ్యులుగా ఎం. తులసి – మహిళా కానిస్టేబుల్, కాజీపేట, సి.హెచ్. మహేందర్ యాదవ్ – ఏఆర్ కానిస్టేబుల్, ఏ. రమేష్ – ఏఆర్ కానిస్టేబుల్, ఎన్. ప్రవీణ్ – కానిస్టేబుల్, సుబేదారి, ఎం.డి. తాజుద్దీన్ – హన్మకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్, పి. సర్వేశ్ – కానిస్టేబుల్, పాలకుర్తి ఎన్నికయ్యారు.
    ఎన్నికల అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. సంఘం ద్వారా పోలీస్ అధికారుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.