EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్‌ఆర్ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

    ఎస్‌ఆర్ హైస్కూల్‌లో ఘనంగా 80వ  స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు

    గోపాల్పూర్: ఎస్‌ఆర్ హైస్కూల్‌ గోపాల్పూర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్మీ జవాన్ మీసాల మల్లేష్‌ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భావి భారత భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే వరకు కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు, విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, దేశ ఔన్నత్యాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆశీర్వదించారు.కార్యక్రమంలో జోనల్ ఇన్‌చార్జ్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి హిమబిందు రెడ్డి, కోఆర్డినేటర్ శ్రీమతి సరితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రణాళిక, భవిష్యత్ లక్ష్యాలపై వారు మాట్లాడారు.అనంతరం విద్యార్థులు వివిధ దేశభక్తి వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక నృత్యాలు, దేశభక్తి గీతాలు, ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.