EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • . గోవిందు నాగరాజు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

    Author
    Posted By JANA CHARITRA
    | 15 Aug 2026, 11:48 AM | TELANGANA, తాజా వార్తలు, వరంగల్
    . గోవిందు నాగరాజు ఆధ్వర్యంలో  స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు

    వరంగల్: 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రకాళి గుడికి వెళ్లే మార్గంలోని మూడు బాటల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోవిందు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మికులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.
    ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐఎన్‌టీయూసీ 452 యూనియన్ అధ్యక్షులు వాగు మారి సత్యనారాయణ పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. అనంతరం 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బోడ డిన్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ప్రజలంతా ఐక్యత, సమగ్రతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి యాకారపు భాస్కర్, మాజీ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, మాతంగి రాజు, 11వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.