EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author
    Posted By JANA CHARITRA
    | 15 Aug 2026, 12:18 PM | TELANGANA, తాజా వార్తలు, తెలంగాణ
    శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, నగదు బహుమతులు అందజేసిన 35వ డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్
    వరంగల్, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
    ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మేరుగు అశోక్ అభినందించి, వారికి ప్రతిభ పురస్కారాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం పట్ల పలువురు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్ర స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మేరుగు అశోక్ ఇప్పటికే సీసీ కెమెరాలు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల భద్రతతో పాటు వారి విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులను నగదు బహుమతులతో ప్రోత్సహించడం సంతోషకరమని తెలిపారు. విద్యార్థులు మరింత పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్ పాక విజయ్, స్కూల్ చైర్మన్ స్వర్గం భాగ్యలక్ష్మి, 35వ డివిజన్ పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, గటిక రాంచందర్, ఎండి. సలీం, మాచర్ల యుగంధర్, రాహుల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 35వ డివిజన్ పరిధిలోని శివనగర్, పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని, జాతీయ సమైక్యతను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు.

    శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Additional Imageశివనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Additional Image