EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హనుమకొండ రెడ్ క్రాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author
    Posted By JANA CHARITRA
    | 15 Aug 2026, 12:20 PM | TELANGANA, తాజా వార్తలు, తెలంగాణ
    హనుమకొండ రెడ్ క్రాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    సుబేదారి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎన్. రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం రెడ్ క్రాస్ ఆవరణలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్లు క్యాతం జగదీశ్వర్, కే. సతీష్ బాబు, ఫార్మసిస్ట్ కె. స్వప్న, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన యల్. ప్రవీణ్, యల్. మంజులలకు జిల్లా అదనపు కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎన్. రవి, చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ. వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ళ రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, రెడ్ క్రాస్ వైద్యులు డా. జె. కిషన్ రావు, డా. టి. మదన్ మోహన్ రావు, డా. మొహమ్మద్ తహర్ మసూద్, రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.