EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విశ్రాంత ఉద్యోగులు సమాజసేవకు పునరంకితం కావాలి: డా. పి. విజయచందర్ రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 15 Aug 2026, 03:56 PM | TELANGANA, నల్గొండ, వరంగల్
    విశ్రాంత ఉద్యోగులు సమాజసేవకు పునరంకితం కావాలి: డా. పి. విజయచందర్ రెడ్డి

    హనుమకొండ, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లో నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ గేమ్స్ టోర్నమెంట్ విజేతలకు శనివారం అవార్డు ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు మెమెంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ.. విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ అనుభవాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త కేంద్రంతో పాటు తలసేమియా సెంటర్, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, జెనరిక్ మెడికల్ షాప్, టైలరింగ్ సెంటర్ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, ప్రజలకు అనుసంధానకర్తలుగా పనిచేసిన పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ అనుభవంతో సమాజానికి అవసరమైన సహాయ సహకారాలు, సలహాలు అందించాలని కోరారు.
    సీనియర్ సిటిజన్స్ కోసం నిర్వహించిన క్రీడా పోటీల్లో కారమ్స్ సింగిల్స్, డబుల్స్, చెస్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన విజేతలకు మెమెంటోలు అందజేసి అభినందించారు. అలాగే 70 సంవత్సరాలు పైబడిన పదవీ విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
    ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, టోర్నమెంట్ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొమురయ్య పెండ్యాల అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా, సభా సంధానకర్తగా బూర రాంచందర్ వ్యవహరించారు.
    కార్యక్రమానికి సుమారు 118 మంది విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ హాజరయ్యారు. టోర్నమెంట్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్న వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.