EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పర్వతగిరి జెడ్పి హెచ్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

    Author
    Posted By JANA CHARITRA
    | 15 Aug 2026, 05:28 PM | Array
    పర్వతగిరి జెడ్పి హెచ్ఎస్  పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జడ్పిహెచ్ఎస్ పర్వతగిరి పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్క భారతీయుడు అందుకోవాలని అందుకు ప్రతి భారతీయ పౌరుడు విజ్ఞానవంతుడు అయినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు పాక రమేష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య అమరవీరుల త్యాగాలను వృధా కాకుండా మన దేశ ప్రగతికి ప్రతి పౌరుడు తన హక్కులకై మాత్రమే పోరాడకుండా పౌర విధులకు బాధ్యత వహించాలని విద్యార్థులకు సూచించారు. స్టాఫ్ సెక్రటరీ శానం వెంకన్న గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశభక్తిని కలిగి ఉండాలని సమాజ చైతన్యం కలిగి ఉండాలని అన్నారు.. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ దేశభక్తి పాటలు పాడుకుంటూ విద్యార్థులతో ప్రభాతభేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.