EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వాగ్గు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం

    వాగ్గు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం

    వరంగల్‌లోని వాగ్గు ఫౌండేషన్ చైర్మన్ శైలజ మరియు వగ్గు రోహిణి వాగ్గు దీపిక ఆధ్వర్యంలో ఆదివారం, 16 ఆగస్టు న ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఖమ్మం రోడ్, వాల్‌మార్ట్ ఎదురుగా ఉన్న ఓరుగల్లు ఐ హాస్పిటల్లో ఈ శిబిరం జరిగింది.
    ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, నేత్ర సంబంధిత వైద్య సేవలు మరియు మందులు కంటి డ్రాప్స్ ఉచితంగా అందించారు. డా. వాగ్గు శ్రీకుమార్, MS (Ophthalmology), ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల, వరంగల్ గారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గడ్డం భాస్కర్, ప్రొఫెసర్ రిటైర్డ్ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్, బేతి అశోక్ బాబు, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ బాసాని శ్రీనివాస్, డి. ఆనంద్, న్యాయవాది శివశంకర్, డాక్టర్ జగదీష్, CA అఖిల్, పాటల రవి, బూరుగుపల్లి శ్రీనివాస్, అమర్ కట్టిపరీక్షలకు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బేతి అశోక్ బాబు మాట్లాడుతూ, కంటి ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా నేత్ర పరీక్షలు, వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. వాగ్గు ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు.ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.వాగ్గు ఫౌండేషన్ – “విజన్ నుంచి వికాసం, మానవ సేవే లక్ష్యం” అన్నారు