EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణలో SIR-2026 ఎన్యూమరేషన్ దశ పూర్తి

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Aug 2026, 08:38 PM | TELANGANA, తాజా వార్తలు
    తెలంగాణలో SIR-2026 ఎన్యూమరేషన్ దశ పూర్తి

    2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరణ.. 78.30 శాతం ఓటర్ల నుంచి స్పందన
    హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIR-2026లో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, IAS తెలిపారు. సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో SIR ప్రక్రియ పురోగతిపై ఆయన వివరించారు.2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల నుంచి 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు (EFs) సేకరించినట్లు CEO తెలిపారు. ఇవి రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 78.30 శాతం అని వెల్లడించారు.ఎన్యూమరేషన్ సందర్భంగా మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని లేదా గైర్హాజరైన ఓటర్లు, ఇతర కేటగిరీలకు చెందిన వారు, అలాగే ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల్లో నమోదైన ఓటర్ల వివరాలను కూడా సేకరించినట్లు అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
    డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
    SIR ప్రక్రియలో తదుపరి దశగా ముసాయిదా ఓటర్ల జాబితా (Draft Electoral Roll) ప్రచురణతో పాటు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16, 2026 వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ దశ కొనసాగుతుందని CEO తెలిపారు.SIR-2026కు సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలను స్వీకరించి పరిశీలిస్తామని CEO తెలిపారు.అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాలను హార్డ్ డిస్క్ ద్వారా అందజేశారు.
    రాజకీయ పార్టీలు చురుకుగా పాల్గొనాలిడ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ పరిశీలనతో పాటు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు చురుకుగా పాల్గొనాలని సి. సుదర్శన్ రెడ్డి కోరారు.అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చూడటం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా ఖచ్చితమైనది, సమగ్రం, పారదర్శకం, లోపరహితంగా ఉండేలా రాజకీయ పార్టీలు, అధికారులు సహకరించాలని CEO విజ్ఞప్తి చేశారు.
    ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, IAS, ప్రభుత్వ అదనపు కార్యదర్శి మరియు MNO ఎన్. శంకర్, డిప్యూటీ CEO (FAC) జి.ఎస్. చారి, PM (IT) నోడల్ అధికారులు, CEO తెలంగాణ కార్యాలయానికి చెందిన ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.