EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కలెక్టర్ ఆవిష్కరించిన కళాయజ్ఞ మినీ పోస్టర్

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Aug 2026, 05:38 PM | TELANGANA
    కలెక్టర్ ఆవిష్కరించిన కళాయజ్ఞ మినీ పోస్టర్

    హనుమకొండ చెందిన చిత్రకారిణి డాక్టర్ మంజుల సాగంటి నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన చిత్రకళ శిక్షణ సంస్థ సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రతినెల ఒక అంశం పైన చిత్ర కళా పోటీలు, క్రాఫ్ట్ తయారీ వర్క్ షాప్ లు, ప్రతి వేసవి సమ్మర్ క్యాంప్ లు, వారంతపు తరగతులు నిర్వహిస్తూ పాల్గొనే వారికి, ప్రతిభ చూపించిన వారికి బహుమతులు, ప్రశంస పత్రాలు అందిస్తూ చిన్నారుల్లోని చిత్రకళను మెరుగు పరుస్తూ ఇప్పటికీ 42 కార్యక్రమాలు నిర్వహించగా... 43 వ కార్యక్రమం కళా యజ్ఞ మినీ పేరుతో 14 రోజులు 7 అంశాలపై జాతీయ స్థాయి లో ఛాలెంజ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా దేశం నలుమూలల నుండి 50+ మంది చిత్రకారులు పాల్గొని 350 కి పైగా చిత్రాలు వేయగా న్యాయ నిర్ణేతల కమిటీ వాటి నుండి ఎంపిక చేసిన 50+ చిత్రాలను ఈ నెల 30 తేదీన హైదరాబాద్ లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ JNAFAU ( ఫైన్ ఆర్ట్స్ కాలేజీ), మాసాబ్ ట్యాంక్ ప్రదర్శన కు ఉంచబోతున్నట్టు సంస్థ అధినేత మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు... ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఈరోజు హనుమకొండ కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ ఐ.ఏ.ఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు... కన్నులపండుగల హైదరాబాద్ లో జరుగబోయే ఈ చిత్రకళ ప్రదర్శనకు రావాల్సిందిగా మంజుల అందరికీ ఆహ్వానం పలికారు...