EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పధకాల రద్దు కుట్రపై బగ్గుమన్న పర్వతగిరి మండల బీ.ఆర్.ఎస్ మండల నాయకులు*

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Aug 2026, 06:07 PM | TELANGANA, వరంగల్
    కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పధకాల రద్దు కుట్రపై బగ్గుమన్న పర్వతగిరి మండల బీ.ఆర్.ఎస్ మండల నాయకులు*

    మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించిన బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు*
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    పర్వతగిరి మండలంలో కల్యాణలక్ష్మి,షాదీముబారక్ తదితర పధకాలపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుంది అని ఆ పధకాలను కొనసాగించడంతో పాటు తులం బంగారం అందించాలని డిమాండ్ .మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బైటహించి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ సూపర్డెంట్ గారికి వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల సంక్షేమంతో ఆటలాడం సరికాదు అన్నారు,ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పధకాలను కొనసాగించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు..
    ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ యం. మనోజ్ గౌడ్,ఏయంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, ఏయంసీ మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్, మాజీ జడ్పీటీసీ లునవత్ పంతులు,మాజీ మండల అధ్యక్షులు రంగు కుమార్ గౌడ్,స్థానిక మాజీ ఎంపిటిసి మాడుగుల రాజు, సర్పంచ్ లు ఏర్పుల శ్రీనివాస్, రాయభరపు వివేక్, డెక్క కుమారస్వామి, మండల నాయకులు చీమల బిక్షపతి,అమడగని రాజు యాదవ్, బానోత్ వెంకన్న,గంధం బాలరాజు, చింతల శ్రీనివాస్,బొట్ల మధు,జనార్దన్ రెడ్డి,జూల్లపెల్లి దేవేందర్ రావు,ధర్నోజ్ దేవేందర్ చారి,బూర శ్యామ్ గూడ నరేందర్ వర్మ,బల్లె వెంకటరాజ్,బొట్ల కిష్టయ్య,మెరుగు వెంకటేశ్వర్లు,కొప్పు రాజు, చింతపట్ల సునీల్ రావు,దొమ్మటి రాజు,మసాని వెంకట్,బొట్ల భాస్కర్ జంగా వీరమల్లు,ఇస్లావత్ హరీష్,దబ్బేట నరేష్,కిషన్ ముదురుకోళ్ల రాజు, శ్రీకాంత్,దాడి వినయ్,మాడుగుల అఖిల్,చిన్నపెల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు...