EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో విస్తృతంగా ఆంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు

    Author
    Posted By JANA CHARITRA
    | 20 Aug 2026, 07:11 PM | TELANGANA, వరంగల్
    ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో విస్తృతంగా ఆంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు

    గత జూన్ నెలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో విస్తృతంగా ఆంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించడం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించడం, డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటి అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
    ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పలువురు పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా అధికారుల పనితీరు, కార్యక్రమాల నిర్వహణలో చూపిన చొరవ, ప్రజలు మరియు విద్యార్థులను భాగస్వామ్యం చేయడంలో చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేసిన టాప్-10 పోలీస్ స్టేషన్ SHOs ను ఎంపిక చేయడం జరిగింది.
    ఈ టాప్-10 SHOs జాబితాలో హన్మకొండ పోలీస్ స్టేషన్ SHO శ్రీ మచ్చ శివకుమార్ గారు కూడా ఎంపిక కావడం జరిగింది. హన్మకొండ పరిధిలో విద్యార్థులు, యువత మరియు ప్రజల్లో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో, విద్యాసంస్థల్లో మరియు ప్రజలకు చేరువగా అనేక ఆంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలను నిర్వహించడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపడం జరిగింది.
    ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లోని కమాండెంట్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిల్య గారి చేతుల మీదుగా SHO హన్మకొండ శ్రీ మచ్చ శివకుమార్ గారికి మరియు CCRB ACP డేవిడ్ రాజ్ గారికి ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ రివార్డు అందజేయడం జరిగింది.
    డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా హన్మకొండ పోలీస్ స్టేషన్ చేసిన కృషికి ఈ గుర్తింపు ఒక ప్రత్యేక అభినందనగా నిలిచింది. భవిష్యత్తులో కూడా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు, ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.