EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Aug 2026, 04:53 PM | TELANGANA, వరంగల్
    40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో  ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

    నేటి రోజులలో అనేకమంది అంటువ్యాధులు ప్రబలి అనారోగ్యమునకు గురి అయ్యి ఆసుపత్రి పాలవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం సందర్భంగా ఉర్సు ప్రతాప్ నగర్ కరీమాబాద్ వాటర్ ట్యాంక్ ప్రాంతాలలో వరంగల్ మహానగర పాలక సంస్థ మలేరియా విభాగం హెల్త్ అసిస్టెంట్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆయిల్ బాల్స్ వేస్తున్న పనితీరును కార్పొరేటర్ మరుపల్ల రవి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేసినారు మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ తమ ఇంటి పరిసరాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన మురుగునీరు వర్షపు నీరునిల్వ ఉండటం వలన దుర్గంధంతో పాటు దోమలు పుట్టుక వచ్చి ప్రజలకు హాని చేకూరుతుందన్నారు ఖాళీ స్థలాల యజమానులు మురుగునీరు వర్షపు నీరు నిల్వ ఉండకుండా స్థలాన్ని సమాంతరం చేసుకోవాలని కోరీ నారు ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శివకుమార్ సిబ్బంది ప్రదీప్ కుమార్ రాజు స్థానికులు ఇల్లందుల శేఖర్ ఇల్లందుల సుజాత మాటేటి రజిత లు ఉన్నారు