EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ పాఠశాలలకు షూస్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

    Author
    Posted By JANA CHARITRA
    | 22 Aug 2026, 12:58 PM | TELANGANA, వరంగల్
    ప్రభుత్వ పాఠశాలలకు షూస్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

    విద్యార్థులకు అందచేసిన మండల విద్యాశాఖ అధికారులు*
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    పర్వతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకొరకు ఉచితంగా షూస్, స్కూల్ బ్యాగులు, హాస్టల్ విద్యార్థుల కొరకు బెడ్షీట్స్ పంపిణీ చేసినట్లు పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు మరియు పాఠశాలలకు బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగ్ లు, షూస్ పంపిణీ చేసినట్లు ఇతర ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు ప్రస్తుతానికి షూ లు పంపిణీ చేసినట్లు దశలవారీగా ప్రాథమిక పాఠశాలలకు కూడా అన్ని పంపిణీ చేయడం జరుగునని తెలిపారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఆయన చేతుల మీదుగా పర్వతగిరి ఉన్నత మరియు కొంకపాక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు షూ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కొరకు అన్ని రకాల వసతులు కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఏనుగల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జి లింగారెడ్డి , పర్వతగిరి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కే నవీన్ కుమార్ , చింతనెక్కొండ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్య గారు చౌటపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య ప్రద్యుమ్న , ఉపాధ్యాయులు అనిల్ పాక రమేష్ బాబు గౌస్ పాషా గారు గౌస్ మొహినుద్దీన్ ఈ. జగదీశ్వరీ గారు ఎమ్మర్సీ సిబ్బంది గారె జయరాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.