EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాత ఇంటి నెంబర్‌తో కొత్త ఇంటి రిజిస్ట్రేషన్! *పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం.. *తప్పుడు ధృవీకరణ పత్రాలపై పోలీసులకు ఫిర్యాదు

    Author
    Posted By JANA CHARITRA
    | 22 Aug 2026, 02:00 PM | తెలంగాణ, వరంగల్
    పాత ఇంటి నెంబర్‌తో కొత్త ఇంటి రిజిస్ట్రేషన్! *పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం.. *తప్పుడు ధృవీకరణ పత్రాలపై పోలీసులకు ఫిర్యాదు

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, ఆగస్టు 22 :*
    పర్వతగిరి మండల కేంద్రం గ్రామపంచాయతీ లో అనుమతి లేకుండా నిర్మించిన కొత్త ఇంటికి పాత ఇంటి నెంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగుల రాజు పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగుల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి నాగుల వీరస్వామికి వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాన్ని ముగ్గురు కుమారులు 2020లో తల్లిదండ్రుల సమక్షంలో పంచుకున్నారని తెలిపారు. తనకు కేటాయించిన భాగంలోని పాత ఇంటికి 3-112 నెంబర్ ఉండగా, తాను కుటుంబంతో కలిసి అందులో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు.
    అయితే తన అనుమతి లేకుండా తన రెండవ అన్న నాగుల వెంకటేశ్వర్లు గ్రామపంచాయతీ నుంచి అవసరమైన నిర్మాణ అనుమతులు పొందకుండా కొత్త ఇంటిని నిర్మించి, తనకు కేటాయించిన పాత ఇంటి నెంబర్ 3-112ను కొత్త ఇంటికి ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై RTI ద్వారా గ్రామపంచాయతీ నుంచి సమాచారం కోరగా, కొత్త ఇంటి నిర్మాణానికి ఎలాంటి పంచాయతీ అనుమతి లేదని రికార్డుల ద్వారా తెలిసిందని నాగుల రాజు తెలిపారు. అయినప్పటికీ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ధృవీకరణ పత్రాలు ఎలా జారీ అయ్యాయనే అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సల్లూరి రఘు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు ఆరోపిస్తూ, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారందరిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

    పాత ఇంటి నెంబర్‌తో కొత్త ఇంటి రిజిస్ట్రేషన్! *పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం.. *తప్పుడు ధృవీకరణ పత్రాలపై పోలీసులకు ఫిర్యాదు - Additional Image