EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న నల్లగొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్

    డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న నల్లగొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్

    నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నల్లగొండకు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు.

    హైదరాబాద్‌లోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పలువురు ఫోటో జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు.

    ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్‌గా సేవలందిస్తున్న ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ తన ఫోటో జర్నలిజం ప్రతిభకు ఈ రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇండియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జాతీయస్థాయి మీడియా ఎడిటర్ల చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.

    ఇవి కూడా చదవండి

    ఫోటో జర్నలిజంలో శ్రీనివాస్ గౌడ్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడం పట్ల నల్లగొండ జిల్లాకు చెందిన పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ఆయన ఫోటో జర్నలిజం ప్రయాణంలో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని వారు పేర్కొన్నారు.