EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ కృషి- ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

    హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్  కృషి-  ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

    హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) కృషి చేస్తోందని ఆ విద్యా సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి తెలిపారు.

    ✅ ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెనేట్ హౌస్‌లో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

    ✅ ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ అధికారులు కె రామకృష్ణారావు గారు, జయేశ్ రంజన్ గారు పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో వారు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

    ఇవి కూడా చదవండి

    ✅ ఈ భేటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)కు చెందిన ప్రతినిధి బృందాలు, ఇతర ప్రతినిధులు కూడా ఉన్నారు.

    ✅ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) కృషి చేస్తోందని ఆ విద్యా సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు.

    ✅ యూనివర్సిటీకి చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా విస్తృత స్థాయిలో విద్యా కోర్సులు, వివిధ విద్యా కార్యక్రమాలను అందించేలా ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వివరించారు.

    ✅ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్‌గా అనుసంధానించే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.