EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జల్సా సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమం

    మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జల్సా సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమం

    హనుమకొండ: ఈ నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించనున్న మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జల్సా సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమంమిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జల్సా సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిలాద్ కమిటీ సభ్యుడు సయ్యద్ మసూద్ పాషా ప్రత్యేక ఆహ్వాన పత్రికను అబ్దుల్ హమీద్ బాబా ( సైలాని బాబా )గారికి అందజేసి, జల్సాకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.

    ఈ సందర్భంగా జల్సాలో నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాలు, ఆ రోజు హాజరుకానున్న ముఖ్య మరియు ప్రత్యేక అతిథుల వివరాలను అబ్దుల్ హమీద్ బాబా గారికి పూర్తిస్థాయిలో వివరించారు.

    అలాగే జల్సాకు హాజరయ్యే వారి కోసం నిర్వహించనున్న ప్రత్యేక టోకెన్ డ్రా కార్యక్రమం గురించి కూడా తెలియజేశారు. ఈ డ్రా ద్వారా ఎంపికయ్యే ఇద్దరు అదృష్టవంతులను ఉమ్రా యాత్రకు ఉచితంగా పంపించే ప్రత్యేక కార్యక్రమం ఈ జల్సా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

    ఇవి కూడా చదవండి

    మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సందేశాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు మిలాద్ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన జరిగే ఈ మహత్తర జల్సాకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని మిలాద్ కమిటీ సభ్యులు కోరారు.