EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో పండుగ సాయన్న జయంతి, వర్ధంతులపై అధికారిక ప్రకటన

    Author
    Posted By JANA CHARITRA
    | 23 Aug 2026, 04:22 PM | TELANGANA, తాజా వార్తలు, వరంగల్
    మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో పండుగ సాయన్న జయంతి, వర్ధంతులపై అధికారిక ప్రకటన

    మంత్రి వాకిటి శ్రీహరి కృషికి ఫలితం.. పండుగ సాయన్న జయంతి, వర్ధంతుల నిర్వహణకు అధికారిక ఉత్తర్వులు*

    *మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారిని కలిసి శుభాకాంక్షలు ,కృతజ్ఞతలు తెలియజేసిన ముదిరాజ్ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్*

    తెలంగాణ రాబిన్‌వుడ్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

    పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ముదిరాజ్‌ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

    ఇవి కూడా చదవండి

    జీవో ప్రకారం ఇకపై ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి, డిసెంబర్ 10న పండుగ సాయన్న వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.

    ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, వాకిటి శ్రీహరికి ముదిరాజ్ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పండుగ సాయన్న వంటి వీరుడి పోరాటాన్ని, త్యాగాన్ని ప్రజా ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం బహుజన సమాజానికి గర్వకారణమని దారం యువరాజ్ ముదిరాజ్ అన్నారు.