EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు: ఎమ్మెల్యే BLR

    Author
    Posted By JANA CHARITRA
    | 25 Aug 2026, 03:54 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    విద్యార్థులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు: ఎమ్మెల్యే BLR

    తుంగపాడు తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ
    తుంగపాడు తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. హాస్టల్‌తో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. విద్యార్థుల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా హాస్టల్ యాజమాన్యాన్ని విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వారి రోజువారీ నిర్వహణ తదితర అంశాలపై ఎమ్మెల్యే వివరాలు అడిగారు. విద్యార్థులతో వ్యక్తిగత లేదా ఇతర పనులు చేయించడం ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.విద్యార్థులతో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు విచారణలో నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పాఠశాల, హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు.విద్యార్థుల హక్కులు, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు