EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Aug 2026, 08:30 PM | TELANGANA, వరంగల్
    ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

    *జన చరిత్ర,రాయపర్తి ఆగస్టు 26 :*
    రాయపర్తి మండలం లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
    ఈ సందర్భంగా పల్లె దవాఖానా లో వ్యాధి నిరోధక టీకా లు చిన్నారులకు వేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
    ఆసుపత్రిలోని మందుల నిల్వలను తనిఖీ చేసి, గడువు తీరిన మందుకు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మందులను సురక్షితంగా భద్రపరిచే తీరును పరిశీలించారు.
    ల్యాబొరేటరీ లో మందుల నిలువ, ఇతర వైద్య సామగ్రి గురించి ల్యాబ్ ఇన్‌చార్జిని అడిగి తెలుసుకున్నారు.
    ల్యాబొరేటరీని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ల్యాబ్ ఇన్‌చార్జిని కలెక్టర్ ఆదేశించారు.
    ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారిని ఆదేశించారు.
    ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
    ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
    ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
    ఆరోగ్య కేంద్రానికి సమస్యలతో వచ్చిన పీషెట్స్ తో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి మాటల్లో ఆసుపత్రి లో అందుతున్న వైద్య సేవల గురించి వారి మాటల్లో తెలుసుకున్నారు.

    ఈ ఆకస్మిక తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రకాష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్,సంబంధిత గ్రామ సర్పంచ్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.