EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలి-బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Aug 2026, 02:22 PM | TELANGANA, వరంగల్
    విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలి-బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు

    తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగుళ్ల భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన “ఫీజు బకాయిలు–బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.

    విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలి-బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు - Additional Image

    ఈ సందర్భంగా ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదని అన్నారు. విద్యార్థుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్రానికి పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి అవసరమని పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఫీజు బకాయిలను వెంటనే చెల్లించి విద్యార్థులు, కళాశాలల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

    ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, బిజెపి నాయకులు అంకాల జనార్ధన్, విప్ప సుధాకర్, ఇనుముల అరుణ్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రవణ్, ఆడెపుల అభిరామ్ తేజ, మున్నా, అజయ్, వినయ్, కార్తీక్, రాజ్ కుమార్ గౌడ్, అభి జిల్లా నాయకులు, బీజేపీ పాల్గొన్నారు.