EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుర్తు తెలియని మృతుడి ఆచూకీ / గుర్తింపు కోసం విజ్ఞప్తి

    Author
    Posted By JANA CHARITRA
    | 29 Aug 2026, 03:50 PM | TELANGANA, వరంగల్
    గుర్తు తెలియని మృతుడి ఆచూకీ / గుర్తింపు కోసం విజ్ఞప్తి

    తేదీ 27-08-2026 న ఉదయం సుమారు 6:40 గంటలకు ఎంజీఎం సూపర్డెంట్ డాక్టర్ వినోద్ గారు ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి 60 సంవత్సరాలు గల వ్యక్తి చనిపోయినాడు సమాచారం ఇవ్వడం జరిగినది. అట్టి వ్యక్తి తను తేదీ 30.12. 2024 న ఉదయం 9 గంటల 26 నిమిషాలకు ఎంజీఎం హాస్పిటల్ నందు తన తలకి సమస్య ఉందని తనకు ఎవ్వరు లేరని చెప్పి అడ్మిట్ అయి న్యూరో వార్డులో నుండి ఐడి వార్డులో వచ్చి ఇన్ని రోజులు చికిత్స చేసినారు అని, ఈరోజు అనగా తేదీ 26.08. 2026 రాత్రి10:00 గంటలకు ఊపిరి ఆడకుండా సీరియస్ గా ఉండడంతో వెంటనే క్యాజువాలిటీకి తీసుకొని వచ్చి చికిత్స చేస్తుండగా ఈరోజు అనగా తేదీ 27.08.2026న తెల్లవారుజామున 02:46 నిమిషాలకు చనిపోయినాడు అని వైద్యులు తెలిపినారు. ప్రాథమికంగా అతని అనారోగ్య కారణంగానే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఎంజిఎం హాస్పిటల్ మార్చురీకి తరలించారు.
    మృతుడి వివరాలు / బంధువుల ఆచూకీ ప్రస్తుతం తెలియరాలేదు. క్రింద ఉన్న మృతుడి ఫోటోను పరిశీలించి ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతని బంధువులు, తెలిసిన వ్యక్తుల గురించి సమాచారం ఉన్నట్లయితే వెంటనే మట్వాడ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగలరు.
    మృతుడి వివరాలు:
    • లింగం: మగ
    • వయస్సు: సుమారు 60 సంవత్సరాలు
    • స్థితి: గుర్తు తెలియని మగ మనిషి
    • దుస్తులు: వంకాయ కలర్ రంగు గల డబ్బాల సెట్టు
    • మృతి చెందిన తేదీ:27-08-2026
    • మృతి చెందిన సమయం: రాత్రి సుమారు 02:46 గంటలు
    ప్రజలు పై ఫోటోను పరిశీలించి మృతుడిని గుర్తించినట్లయితే మట్వాడ పోలీస్ స్టేషన్కు
    Si. 8712685090
    Ci. 8712685117 లకు సమాచారం అందించగలరు.