EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆర్డి ఎఫ్ కళ్లెడ హైస్కూల్‌లో మోడల్ ఎలక్షన్స్ – హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నిక

    Author
    Posted By JANA CHARITRA
    | 29 Aug 2026, 09:34 PM | TELANGANA, వరంగల్
    ఆర్డి ఎఫ్ కళ్లెడ హైస్కూల్‌లో మోడల్ ఎలక్షన్స్ – హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నిక

    *జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, ఆగష్టు 29 :*
    పర్వతగిరి మండలం ఆర్డి ఎఫ్ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఆర్ డి ఎఫ్ కళ్లెడ హైస్కూల్‌లో మోడల్ ఎలక్షన్స్‌ను నిర్వహించారు.
    ఈ ఎన్నికల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల ద్వారా హెడ్ బాయ్, హెడ్ గర్ల్‌ను విద్యార్థులు ఎన్నుకున్నారు.
    ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ప్రచారం నిర్వహించి, తమ ఆలోచనలు మరియు ప్రణాళికలను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఓటింగ్ నిర్వహించి, ఓట్లను లెక్కించి అత్యధిక ఓట్లు సాధించిన విద్యార్థులను హెడ్ బాయ్ గా బి. సుమన్, హెడ్ గర్ల్‌గా యం .శివాత్మిక ,అసిస్టెంట్ హెడ్ బాయ్ గా జి. వరుణ్ తేజా ,అసిస్టెంట్ హెడ్ గర్ల్ గా ఆర్. సహస్ర ను ప్రకటించారు.
    ఈ కార్యక్రమాన్ని పాఠశాల సోషల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన జి.మధుకర్, వి. రజని సమన్వయంతో నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, నాయకత్వ బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది.
    ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్, ఇంచార్జెస్ ఎ.సంతోష్, జి. రమేష్ పాఠశాల ఏ ఓ ఎస్. రాజు మాట్లాడుతూ ఇటువంటి మోడల్ ఎలక్షన్స్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెంపొందుతాయని తెలిపారు.
    కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సోషల్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు ఉపాధ్యాయులు, విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.