EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కే బి ఆర్ క్యాంపు కార్యాలయంలో.. నల్లగొండ నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 02:46 PM | TELANGANA, నల్గొండ
    కే బి ఆర్ క్యాంపు కార్యాలయంలో.. నల్లగొండ నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం

    కే బి ఆర్ క్యాంపు కార్యాలయంలో.. నల్లగొండ నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినది... జెడ్పి మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు..
    కంచర్ల మాట్లాడుతూ..
    కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విపల పాలనపై.. రాష్ట్ర పార్టీ ఇచ్చిన నిరసనల షెడ్యూల్ ను ప్రకటించారు..
    సెప్టెంబర్ 1న ప్రెస్ మీట్.
    రెండో తేదీన నియోజకవర్గం కేంద్రంలో ధర్నా బాకీ కార్డుల పంపకం ప్లెక్సీ ప్రదర్శన మూడో తేదీన రైతు సదస్సులు సదస్సులు నాలుగవ తేదీన మహిళలు వికలాంగుల. వంటావార్పు, ఐదవ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ జాబ్ క్యాలండర్ కొరకు యూత్ ర్యాలీలు ఏడవ తేదీన మండల జిల్లా ప్రజావాణిలో వినతి పత్రాలు సెప్టెంబర్ 8వ తేదీన అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఎనమిది రోజుల కార్యక్రమాలపై ప్రెస్ మీట్.. పార్టీ ప్రకటించిన ఈ కార్యక్రమాలను కార్యకర్తలు నాయకులు, ప్రజలవద్దకు తీసుకుని వెళ్లి విజయవంతం చేయాలని కోరారు. జెడ్పి మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం మాటలతో గద్దెనెక్కిందని వారు పరిపాలన చేసేది మరొక సంవత్సరమేనని ఆ తర్వాత ఎన్నికల సంవత్సరమేనని.. ఈ మూడు సంవత్సరాల్లో వారు ప్రజలకు చేసింది ఏమీ లేదని తప్పుడు ప్రచారంతో కేసీఆర్ ను బదనామ్ చేస్తున్నారని ఉన్నారని.. నాయకులు కార్యకర్తలు వాస్తవాలు ప్రజలకు వివరించాలని కోరారు.
    మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారు.. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఈనెల 3వ తేదీన మిర్యాలగూడ కు వస్తున్నందున నల్లగొండ నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని, విజ్ఞప్తి చేశారు.
    ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్ నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాజీ ఎంపీపీ కరీం పాషా,బొజ్జ వెంకటయ్య, మాజీ జడ్పిటిసిలు తండు సైదులు గౌడ్ తుమ్మల లింగస్వామి, నగర పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి,... ల తో పాటు పలువురు కార్పొరేటర్లు సర్పంచులు, నగర, మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు