EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విజయవంతమైన చిత్ర కళా ప్రదర్శన కళా యజ్ఞ మినీ

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 05:23 PM | TELANGANA, వరంగల్, హన్మకొండ
    విజయవంతమైన చిత్ర కళా ప్రదర్శన కళా యజ్ఞ మినీ

    హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జూలై నెలలో ప్రారంభించి 14 రోజుల పాటు 7 ప్రత్యేక అంశాల పైన జాతీయ స్థాయిలో కళా యజ్ఞ పేరుతో ఆర్ట్ చాలా నిర్వహించగా దేశం నలుమూలల నుంచి 50+ కి పై ఆర్టిస్టులు పాల్గొని 350 కి పైగా చిత్రాలు వేయగా వాటిల్లో నుండి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి, వాటితో నిన్న హైదరాబాద్ లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాల నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ లో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేయగా బి సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభోత్సవం చేయగా, ప్రముఖ సినిమా దర్శకులు శివ నాగేశ్వర రావు, ప్రముఖ రచయిత బ్నిం ఆర్టిస్టులకు సన్మానం చేయడం తో విజయవంతంగా ముగిసింది... ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ డా.సాగంటి మంజుల తో పాటు.. ప్రముఖ చిత్రకారులు డాకోజు శివప్రసాద్, చిత్ర, జయశ్రీ ప్రభాకర్, చిప్పకుర్తి శ్రీనివాస్, దార్ల నాగేశ్వర రావు, దుర్గారావు , 50+ పాల్గొన్న చిత్రకారులు, వందల మంది చిత్ర కళా ప్రియులు పాల్గొన్నారు...