EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 06:23 PM | తెలంగాణ, వరంగల్
    దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి

    వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి గారు దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు.

    ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య సేవలు, రికార్డులు, రిజిస్టర్లు మరియు సంబంధిత ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సమయానికి అందించాలని, అన్ని ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని డా. రాజా రెడ్డి సూచించారు. అదేవిధంగా సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి హాజరై, పని వేళలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి

    రికార్డులు, రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సక్రమంగా మరియు పూర్తి వివరాలతో నిర్వహించాలని, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి ఆదేశించారు.

    ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సజిదా, స్థానిక వైద్య అధికారులు కిరణ్ కుమార్, డా. రాకేష్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.