EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైద్య ఆరోగ్య శాఖలో అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 07:11 PM | TELANGANA, తెలంగాణ, హన్మకొండ
    వైద్య ఆరోగ్య శాఖలో అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం

    హనుమకొండ DEMO వేముల అశోక్‌రెడ్డికి ఘనంగా పదవీ విరమణ సన్మానం
    హనుమకొండ జిల్లా విస్తరణ, మీడియా అధికారి (DEMO) శ్రీ వేముల అశోక్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. అప్పయ్య అధ్యక్షత వహించారు.

    ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డా. అప్పయ్య మాట్లాడుతూ, అశోక్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (IEC) కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
    వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పిస్తూ, ప్రజలకు ఆరోగ్య సందేశాలను చేరవేయడంలో అశోక్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు

    వైద్య ఆరోగ్య శాఖలో అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం - Additional Image

    తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్మోహన్‌రావు మాట్లాడుతూ, అశోక్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖకు మాత్రమే కాకుండా టీజీఓ అసోసియేషన్‌కు కూడా తన సేవలను అందించారని తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా , అవతరణ దినోత్సవాలు ,సందర్భంగా ప్రత్యేకంగా శకటములు (Tableau) రూపొందించడంలో అశోక్‌రెడ్డి చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సృజనాత్మకతతో, సమర్థవంతమైన ప్రణాళికతో కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారని కొనియాడారు.

    కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, అశోక్‌రెడ్డి సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఆరోగ్య కార్యక్రమం విజయవంతం కావడంలో సదా ఆయన కృషి చేశారని విందులు నిర్వహణలో ఇతర ఉద్యోగులు ఆయనుఆదర్శంగా తీసుకోవాలన్నారు
    41 సంవత్సరంలు ప్రజారోగ్య విభాగంలో సేవలందించడం చాలా అభినందనీయమని జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీ ఆకవరపు శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు.
    ఈ సందర్భంగా అశోక్‌రెడ్డిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.

    ఈ కార్యక్రమంలో వరంగల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సిహెచ్ రాజారెడ్డి టీబీ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ,అదనపు డీఎంహెచ్‌ఓ డా. మదన్‌మోహన్, డా. కృష్ణారావు, డా. రజిత, , రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ జయకుమార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్మోహన్‌రావు, టీజీఓ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకవరం శ్రీనివాస్, కార్యదర్శి ప్రవీణ్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నవాజ్‌ఖాన్, తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొప్పు ప్రసాద్, కార్యదర్శి కిరణ్, శ్రీనివాస్, రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.