EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తవేరా ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 11:57 PM | TELANGANA, వరంగల్
    తవేరా ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు

    నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పరిధిలోని నేషనల్ హైవే 365పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకతీయ గురుకులం మార్గమధ్యలో ద్విచక్ర వాహనాన్ని తవేరా వాహనం ఢీకొట్టినట్లు సమాచారం.
    ఈ ప్రమాదంలో నెక్కపేటకు చెందిన రాజేష్‌రావు అనే ద్విచక్ర వాహనదారుడి కాలు తీవ్రంగా గాయపడి నుజ్జునుజ్జయినట్లు తెలిసింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.