EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సావనీర్‌ బుక్‌ను వెనక్కి తీసుకోవాలి* *జీడబ్ల్యూఎంసీ సావనీర్‌పై బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం పుస్తకాన్ని చింపివేసి నిరసన

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 11:58 PM | TELANGANA, వరంగల్
    సావనీర్‌ బుక్‌ను వెనక్కి తీసుకోవాలి*  *జీడబ్ల్యూఎంసీ సావనీర్‌పై బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం పుస్తకాన్ని చింపివేసి నిరసన

    *తెలంగాణ/వరంగల్,ఆగస్టు 31*

    వరంగల్‌: వరంగల్‌ మహానగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)గత పాలకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు,వివరాలను సావనీర్‌ బుక్‌లో ప్రచురించకపోవడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు,మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ వెంకన్నను కలిసి వినతిపత్రం అందజేశారు.బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మసూద్‌,మాజీ కార్పొరేటర్లు మరుపల్లి రవి,ఆవాల రాధికా రెడ్డి,గుగులోత్‌ రాజునాయక్‌ తదితరులు మాట్లాడుతూ..సావనీర్‌లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల ఫొటోలు మాత్రమే ప్రచురించడం సరైన విధానం కాదన్నారు.గత పాలకవర్గం,బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటోలు,వివరాలను కూడా చేర్చాలని డిమాండ్‌ చేశారు.కార్పొరేషన్‌ పంపిణీ చేసిన సావనీర్‌ బుక్‌ను చింపివేసి నిరసన తెలిపారు.ప్రస్తుత సావనీర్‌ను వెంటనే వెనక్కి తీసుకుని,అన్ని ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి పనులను పొందుపరిచి కొత్త సావనీర్‌ను ప్రచురించాలని డిమాండ్‌ చేశారు.లేనిపక్షంలో మాజీ కార్పొరేటర్లు,పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.