EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో పదవీ విరమణ చేసిన ASI సర్వేశం ఘన సన్మానం

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Sep 2026, 08:46 PM | TELANGANA, వరంగల్
    హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో పదవీ విరమణ చేసిన  ASI సర్వేశం ఘన సన్మానం

    హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ASI సర్వేశం గారు తన సేవా కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి 31.08.2026న పదవీ విరమణ చేశారు.

    ఈ సందర్భంగా హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ గారు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పసుల సర్వేశం గారిని ఘనంగా సన్మానించి, శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

    ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాచ శివకుమార్ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలకు సేవలందించిన పసుల సర్వేశం గారి సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని పసుల సర్వేశం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు