EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈనెల 5 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Sep 2026, 07:25 PM | TELANGANA, నల్గొండ
    ఈనెల  5 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి

    నల్గొండ జిల్లా, నకిరేకల్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనకు హాజరుకానున్న దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల ఐదున నల్గొండ జిల్లా, నకిరేకల్ కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారని, ఏరియా ఆసుపత్రి ప్రారంభం తర్వాత బహిరంగ సభకు వస్తారని, అక్కడే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
    రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆయా శాఖల ద్వారా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి జిల్లాలోని గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని డిఆర్ఓ ను ఆదేశించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, స్టేజి డయాస్ ,కుర్చీలు, తాగునీరు, టెంట్లు, పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు, బహిరంగ సభ నిర్వహించే స్టేడియం చుట్టు పక్కల శానిటేషన్ నిర్వహించాలని, పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, మున్సిపల్ రోడ్లు, పంచాయతీ రోడ్లు, గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు .అలాగే హేలిప్యాడ్ వద్ద పరిశుభ్రతతో పాటు, డబుల్ బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కవరేజ్ కి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని, మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్ల వంటి ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి,డిఆర్ఓ దశరథ్,జిల్లా అధికారులు హాజరయ్యారు.